మెగాస్టార్, పవర్ స్టార్ ఒకే రోజున సిని ముహుర్తం..

- April 26, 2016 , by Maagulf
మెగాస్టార్, పవర్ స్టార్ ఒకే రోజున సిని ముహుర్తం..

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు అనే సంక్షోభం వీడింది.. ఎట్టకేలకు మెగాస్టార్ తన సినిమాను మొదలెడుతుండటం మెగా అభిమానులకు ఉత్సాహాన్ని తెప్పిస్తుంది. అయితే అదే రోజున పవర్ స్టార్ తన తర్వాత సినిమా ముహుర్తం పెట్టుకోవడం విశేషం. పవన్ కళ్యాణ్, ఎస్.జె సూర్య సినిమాల ముహుర్తం కూడా అదేరోజు కమిట్ అయ్యారు.ఈ నెల 29న మెగాస్టార్ మరోసారి కెమెరా ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యారు. కత్తి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకు వినాయక్ డైరెక్ట్ చేస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఎన్నాళ్లనుండో ఎదురుచూస్తున్న ఈ శుభముహుర్తం దగ్గర పడేసరికి మెగా ఫ్యాన్స్ లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇక ఇదే రోజు పవర్ స్టార్ కూడా ఖుషికి సీక్వల్ సినిమాకు ముహుర్తం పెట్టబోతున్నారు.సర్దార్ ఆడియోలో మెగాస్టార్, పవర్ స్టార్ :ఎస్.జె సూర్య డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మించిన శరత్ మరార్ నిర్మించడం విశేషం. అయితే అన్నదమ్ములు ఇద్దరు అనుకోని ఒకేరోజు ముహుర్తం ఫిక్స్ చేశారా అన్నది పక్కన పెడితే ఒకేరోజు ఇద్దరు మెగా హీరోల సినిమాలు స్టార్ట్ అవడం ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పాలి. కత్తిని పదును పెట్టి పెట్టి ఇన్నాళ్లకు చిరు తన సినిమాను డిక్లేర్ చేయడం విశేషం.అయితే ఈ సినిమాకు రాం చరణ్ ప్రొడ్యూస్ చేయడం విశేషం. మరి సినిమా స్టార్ట్ అయితే ఒకేరోజు చేశారు కాని రిలీజ్ మాత్రం ఒకేసారి పెట్టుకునే అవకాశం లేదు. మెగాస్టార్ చాలా సంవత్సరాల తర్వాత చేస్తున్న సోలో సినిమా కాబట్టి సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా చూడటం మెగా హీరోల బాధ్యత మరి సినిమాతో చిరు ఏం చేస్తాడో చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com