డెలివరీ రైడర్లకు కొత్త లైసెన్స్ విధానం
- December 15, 2022
దుబాయ్: ఎమిరేట్‌లోని డెలివరీ రైడర్‌లను ధృవీకరించే కార్యక్రమాన్ని దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (RTA) ప్రకటించింది. డెలివరీ మోటార్‌బైక్ రైడర్‌ల పనితీరును మెరుగుపరచడం, దుబాయ్‌లో విస్తృత శ్రేణి వినియోగదారులకు అందించే సేవలను మెరుగుపరచడం తమ లక్ష్యమని అథారిటీ తెలిపింది. డెలివరీ కంపెనీలు తమ ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారమ్‌లు, అప్లికేషన్‌ల ద్వారా అందుబాటులో ఉన్న డ్రైవర్ అర్హత సర్టిఫికేట్‌ను తప్పనిసరిగా పొందాలని RTA పేర్కొంది.
ఈ సంవత్సరం ప్రారంభంలో దుబాయ్‌లోని అధికారులు మోటర్‌బైక్ రైడర్‌లను వేగంగా నడపడం, ట్రాఫిక్ నియమాలను విస్మరించడం వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించడానికి పెద్దస్థాయిలో ప్రచారాలను ప్రారంభించారు. ఇందులో భాగంగా డ్రైవర్లకు లైసెన్సు ఇవ్వడం మరింత కఠినం చేశారు.
ఈ ఏడాది ప్రారంభంలో దుబాయ్ పోలీసులు విడుదల చేసిన డేటా ప్రకారం.. గతేడాది మోటార్‌సైకిళ్లతో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మరణించగా, 253 మంది గాయపడ్డారు. సంవత్సరంలో మొదటి రెండు నెలల్లో, పోలీసు ట్రాఫిక్ విభాగం 46 ప్రమాదాలను నమోదు చేసింది. ఇందులో ముగ్గురు మరణించగా.. 47 మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- జస్టిస్ సూర్యకాంత్ కొత్త సీజేఐ!
- ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో “దండక సాహిత్యం–ఉనికి, ప్రాభవం' సభ విజయవంతం
- నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ: సీఎం చంద్రబాబు
- నవంబర్‌లో బ్యాంకులకు సెలవులే సెలవులు
- చట్టపరమైన రాజీ ప్రక్రియకు @ తరధీ యాప్..!!
- ఖతార్‌లో ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో తనిఖీలు..!!
- GDRFA దుబాయ్ కు 'ఉత్తమ AI గవర్నెన్స్ స్ట్రాటజీ' అవార్డు..!!
- కువైట్ లో HIV టెస్ట్ రిజల్ట్స్ ఫోర్జరీ..!!
- ఒమన్‌లో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్యాంపింగ్ ఏరియా..!!
- నకిలీ జాబ్, సామాజిక బీమా మోసం కేసులో ఐదుగురికి శిక్ష..!!







