ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్!
- April 26, 2016
నూతన తారలతో ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్! ఎన్‌కౌంటర్, శ్రీరాములయ్య, జయం మనదేరా, భద్రాచలం, యమజాతకుడు ఆయుధం, జై బోలో తెలంగాణ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించి దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాందించుకున్న సుప్రసిద్ధ దర్శకుడు ఎన్.శంకర్ తన స్వీయ దర్శకత్వంలో మహాలక్ష్మీ ఆర్ట్స్ పతాకంపై మరో కొత్త సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు. తనదైన శైలిలో అంతా కొత్తవారితో ఓ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను దర్శక, నిర్మాత ఎన్.శంకర్ తెలియజేస్తూ ‘ ప్రతిభ వున్న యువ నటీనటులను ఈ నూతన చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం చేయాలని నిర్ణయించాను. ప్రస్తుతం వారి అన్వేషణ సాగుతుంది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ పాత్రల కోసం 18 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువతీ యువకులు కావాలి. చిత్రంలో ఎనభై శాతం పాత్రలు ఈ ఏజ్ గ్రూప్‌కు చెందినవే. ఇతర పాత్రల కోసం కూడా 5 నుంచి 80 సంవత్సరాల వయసు మధ్య గల వారిని కూడా నటనపై ఆసక్తి వుంటే వారికి తగిన పాత్రలు వున్నాయి. గుడ్ లుకింగ్‌గా వుండి... నటనపై ఆసక్తి వుండి.. నటన రాకున్నా ఎంపిక తర్వాత వర్క్‌షాప్ నిర్వహించి తగిన శిక్షణ ఇస్తాం. ఆసక్తి గల వారు ఫోటోలు, పోర్ట్ పోలియోలు, మే 31వరకు [email protected]కు ఈమెయిల్ చేయండి. ప్రతిభ గల వారికి తప్పకుండా మంచి అవకాశం కల్పిస్తాం. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాను’అని తెలిపారు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







