మాచర్ల ఘటన..ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది: ఏపీ డీజీపీ

- December 17, 2022 , by Maagulf
మాచర్ల ఘటన..ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది: ఏపీ డీజీపీ

అమరావతి: మాచర్ల టీడీపీ ఇన్చార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి నివాసం, పార్టీ కార్యాలయం, వాహనాలకు దుండగులు నిప్పు పెట్టిన ఘటన కలకలం రేపుతోంది.ఈ ఘటనలో మాచర్ల ఉద్రిక్తంగా మారింది. పట్టణంలో పరిస్థితి మరింత చేజారకుండా ఉండేందుకు పోలీసులు 144 సెక్షన్ విధించారు.

మరోవైపు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. మాచర్లలో అదనపు బలగాలను మోహరించినట్టు చెప్పారు.ఐజీ త్రివిక్రమ్ ను మాచర్లకు పంపినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అక్కడ శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని చెప్పారు. శాంతిభద్రతలకు ఎవరైనా విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com