సౌదీ అరేబియాలోనే 2024 సీజన్ మొదటి ఫార్ములా 1 రేసు
- December 18, 2022
రియాద్: ఫార్ములా 1 (F1) ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో 2024 సీజన్‌లో మొదటి గ్రాండ్ ప్రిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి సౌదీ అరేబియా రాజ్యం సిద్ధమవుతోంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇది ఆస్ట్రేలియాలో జరగాల్సి ఉన్నది. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ మెల్‌బోర్న్‌లో రేసును నిర్వహించేందుకు 2037 వరకు తన ఒప్పందాన్ని చేసుకున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా సౌదీ అరేబియా 2024 మొదటి రేసును నిర్వహిస్తుందని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ కార్పొరేషన్ పేర్కొంది. “డీల్‌లో భాగంగా 2023, 2037 మధ్య కనీసం నాలుగు సంవత్సరాల పాటు F1 సీజన్ మొదటి రేసును మెల్బోర్న్ ఆతిథ్యమిస్తుంది. రంజాన్ పండుగ సందర్భంగా సౌదీ అరేబియా 2024 F1 సీజన్ మొదటి రేసుకు ఆతిథ్యం ఇస్తుంది.’’ అని తెలిపింది. పవిత్ర రంజాన్ మాసం 2024లో మార్చి 11న ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే F1 గవర్నింగ్ బాడీ 2024 సీజన్ కోసం రేస్ షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. మరోపక్క సౌదీ అరేబియాలో 2024 సీజన్ ప్రారంభ రేసును నిర్వహించేందుకు జెడ్డా స్ట్రీట్ సర్క్యూట్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







