ఫిఫా వరల్డ్ కప్ కైవశం చేసుకున్న అర్జెంటీనా.!
- December 18, 2022
దోహా: ఫిఫా ప్రపంచకప్ లో అర్జెంటీనా మరోసారి మెరిసింది. ఆదివారం రాత్రి ఫ్రాన్స్ తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో విజయం సాధించి సుదీర్ఘ కాలం తర్వాత వరల్డ్ కప్ ను ముద్దాడింది. పెనాల్టీ షూటౌట్ కు దారి తీసిన ఈ మ్యాచ్ లో అర్జెంటీనా 4-2 తేడాతో ఫ్రాన్స్ పై విజయం సాధించింది.ఖతార్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగింది ఫైనల్ ఫైట్. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ఆధిపత్యం కొనసాగించింది. ఏకంగా రెండు గోల్స్ చేయగా.. ఫ్రాన్స్ గోల్స్ ఏమీ చేయలేకపోయింది. కానీ.. సెకండాఫ్‌లో నెమ్మదిగా పుంజుకుంది. బ్యాక్ టు బ్యాక్ గోల్స్‌తో ఆటగాళ్లలో ఉత్సాహం వచ్చింది. అర్జెంటీనా స్టార్ ప్లేయర్ మెస్సి.. మరోసారి మెస్మరైజ్ చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో తొలి గోల్ కొట్టి.. అర్జెంటీనా అభిమానుల్లో జోష్ నింపాడు. అదే ఉత్సాహంతో ఆడిన ఆటగాళ్లు ఫ్రాన్స్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించారు. ఫస్టాఫ్‌లో అర్జెంటీనా ప్లేయర్ డి-మారియా రెండో గోల్ చేశాడు. అలా ఫస్టాఫ్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది అర్జెంటీనా. ఫ్రాన్స్ కోలుకునేందుకు అవకాశమే ఇవ్వలేదు. సెకండాఫ్ నిర్ణీత సమయం ముగిసే సరికి ఫ్రాన్స్ కూడా రెండు గోల్స్ చేయడంతో సమయం పొడిగించారు. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో లియోనెల్ మెస్సీ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఒక ప్రపంచకప్ టోర్నీలో గ్రూప్ లెవల్లో, క్వార్టర్ ఫైనల్స్‌లో, సెమీఫైనల్స్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌లోను గోల్ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.


తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







