వామ్మో.! ఈ తమిళ ‘ప్రిన్స్’ మామూలోడు కాదుగా.!
- December 20, 2022
‘డాక్టర్’, ‘డాన్’ చిత్రాలతో ఇటీవల మంచి విజయాలు అందుకున్న తమిళ హీరో శివకార్తికేయన్. తాజాగా ‘ప్రిన్స్’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తెలుగు డైరెక్టర్‌తో తొలిసారి శివకార్తికేయన్ నటించిన సినిమా ఇది.
అయితే, ఆశించిన అంచనాలు అందుకోలేక పోయిందనుకోండి.ఇప్పుడు ‘అయలాన్’ అనే సినిమాలో శివకార్తికేయన్ నటిస్తున్నాడు. రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో, భారీ విజువల్స్‌తో రూపొందించబోతున్నారట.
అందుకోసం మనోడు ఏకంగా ‘అవతార్ 2’ టీమ్‌నే ఎంగేజ్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా విజువల్ ఎఫెక్ట్స్‌లో భారీ క్రేజ్ క్రియేట్ చేసిన హాలీవుడ్ టెక్నీషియన్లలో కొంతమంది శివ కార్తికేయన్ ‘అయలాన్’ మూవీ కోసం పని చేస్తున్నారట.
ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఏలియన్ నేపథ్యంలో సినిమా వుండబోతోందనీ ఇటీవల రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా అర్ధమవుతోంది. చూడాలి మరి, ‘అవతార్ 2’ క్రేజ్ ‘అయలాన్’కి ఎంత మేర వర్కవుట్ అవుతుందో.!
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







