ఎన్టీయార్ జాన్వీదిగి రావల్సిందేనా.?

- December 20, 2022 , by Maagulf
ఎన్టీయార్ జాన్వీదిగి రావల్సిందేనా.?

అతిలోక సుందరి జాన్వీ కపూర్ ఎప్పుడెప్పుడు తెలుగులోకి ఎంట్రీ ఇస్తుందా.? అని కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తోంది టాలీవుడ్. అయితే, ఆమె అంతకంతకూ వెనక్కి జరుపుకుంటూ పోతోంది ఈ సదవకావాన్ని.
ఇప్పటికే చాలా మంది హీరోలు జాన్వీని తెలుగులోకి తీసుకురావాలని తెగ ట్రై చేశారు. కానీ, జరగలేదు. యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమాతో జాన్వీ కపూర్ ఎంట్రీ తప్పదని తాజా ఖబర్.
ఎన్టీయార్, కొరటాల కాంబినేషన్ మూవీకి ఇంతవరకూ హీరోయిన్ ఫిక్స్ కాలేదన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్దే, రష్మిక.. ఇలా పలువురు ముద్దుగుమ్మల పేర్లు పరిశీలించారు. కానీ, ప్యాన్ ఇండియా ఫ్లేవర్ తెప్పించడానికి బాలీవుడ్ ముద్దుగుమ్మలపైనే కొరటాల కన్నున్నట్లు తెలుస్తోంది.
ఆ క్రమంలో అలియాని ఆల్రెడీ ట్రై చేశారు. అనివార్య కారణాల వల్ల ఆ ప్రయత్నం విపలమైంది. ఇక తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి జాన్వీ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలోనూ జాన్వీ పేరు వినిపించినా, అది నిజం కాదని తేలిపోయింది.
కానీ, భారీ మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో జాన్వీ ఒప్పుకోక తప్పలేదని తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది ఈ విషయంలో.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com