‘హిట్ 3’ కోసం నాని స్పెషల్ సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నాడా.?
- December 20, 2022
కంటెంట్ తెగ నచ్చేయడంతో కొత్త డైరెక్టర్ అయినా తన సొంత బ్యానర్‌లో సినిమా చేసేందుకు నాని ముందుకొచ్చాడు. అదృస్టం కలిసొచ్చింది చిన్న సినిమాగా తెరకెక్కిన సినిమా పెద్ద హిట్ అందుకుంది.
అదే ‘హిట్’ మూవీ. ఆ ఎంకరేజ్‌తోనే ఈ సినిమాకి సిరీస్ కూడా తెరకెక్కించారు. డబుల్ లక్. అది కూడా సూపర్ హిట్. ‘హిట్ - ది సెకండ్ కేస్’ టైటిల్‌తో డిశంబర్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘హిట్ 2’ సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే.
జనవరిలో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. ప్రముఖ ఓటీటీ ఛానెల్ అమెజాన్ ప్రైమ్‌లో ‘హిట్ 2’ స్ర్టీమింగ్ కానుంది.
కాగా, ఇదే సందర్భంలో ‘హిట్ 3’ స్ర్కిప్టు కూడా సిద్ధం చేసేశాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇక, మూడో హిట్ కోసం డైరెక్ట్‌గా నానినే రంగంలోకి దిగుతున్నాడట. మూడో హిట్‌లో నాని కీలక పాత్ర పోషిస్తున్నాడనీ ఆయన రోల్ షాకింగ్ అండ్ సర్‌ప్రైజింగ్‌గా వుండబోతోందనీ అంటున్నారు. మొత్తానికి చిన్న సినిమాగా మొదలుపెట్టి, మంచి ప్లానింగ్‌తో నాని భలే ముందుకెళ్తున్నాడులే. నాని ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా వుండలేం సుమా. కీప్ ఇట్ అప్ నాని.!
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్‌లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్‌తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్‌లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్‌లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్‌లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







