దుబాయ్‌లో 3 నెలల్లో యాప్‌ బేస్డ్‌ ట్యాక్సీలు

- April 26, 2016 , by Maagulf
దుబాయ్‌లో 3 నెలల్లో యాప్‌ బేస్డ్‌ ట్యాక్సీలు

మొబైల్‌ అప్లికేషన్‌ ట్యాక్సీ సర్వీసులు లేదా ఇ-హెయిల్‌ కంపెనీలు (ఉబెర్‌ మరియు కరీమ్‌ వంటివి) మూడు నెలల్లో తమ సేవల్ని అందించడానికి అనుమతి పొందే అవకాశాలున్నాయి. కొత్త నిబంధనల ప్రకారం ఇ-హెయిల్‌ కంపెనీలు ఆన్‌లైన్‌ బుకింగ్‌ మరియు పేమెంట్‌ మోడ్‌తో వినియోగదారులకు ట్యాక్సీ సేవలు అందించవచ్చు. ట్రాన్స్‌పోర్టేషన్‌ సిస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌, రోడ్స్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ డైరెక్టర్‌ అదెల్‌ షాకెరి ఈ విషయాన్ని ధీవీకరించారు. భద్రత అతి ముఖ్యమైన అంశమనీ, ఇ-హెయిల్‌ సంస్థలు తమ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా లైసెన్సులు పొందవలసి ఉంటుందని ఆయన చెప్పారు. చాలా కంపెనీలు దుబాయ్‌లో ఈ తరహా సేవలు అందించడానికి ముందుకు వస్తున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com