IPL 2022 లోకి కొత్తగా రెండు టీమ్ లు
- December 22, 2022
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL).. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ స్వరూపాన్నే మార్చేసింది. క్రికెటర్లకు, కార్పొరేట్ సంస్థలకు కాసులు కురిపిస్తోంది. గత రెండేళ్లలో ఐపీఎల్ బిజినెస్ విలువ అక్షరాల 10 బిలియన్ డాలర్లు. 2022లో ఐపీఎల్ విలువ 10 బిలియన్ డాలర్లు దాటేసింది. 2020 తర్వాత డాలర్ల రూపేణా 6.2 బిలియన్ డాలర్ల నుంచి 10.9 బిలియన్ డాలర్ల మార్క్ కు చేరుకుంది. మన రూపాయిల్లో 90 శాతం వృద్ధి నమోదైతే.. డాలర్లలో 75 శాతం దాటిందని డీ అండ్ పీ అడ్వైజరీ సంస్థ విడుదల చేసిన నివేదిక పేర్కొంది.
2022లో ఐపీఎల్ టోర్నీలోకి రెండు కొత్త ప్రాంచైసీలు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ చేరడంతో మీడియా హక్కుల వేలం రూపంలో ఐపీఎల్ మేనేజ్ మెంట్ కు, దాని నిర్వహక సంస్థ బీసీసీఐకి వచ్చిన నిధులు 10.9 బిలియన్ డాలర్లు. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ విలువ 1.6బిలియన్ డాలర్లు. స్థిరమైన కరెన్సీ ప్రాతిపదికన ఐపీఎల్ విలువ 12 బిలియన్ డాలర్లకు చేరువలో ఉంది.
అయితే ఫారెక్స్ మార్కెట్ లో అమెరికా డాలర్ పై రూపాయి మారకం విలువ 10-12 శాతం పతనమైంది. ఈ ఏడాది రెండు విభిన్న రైట్స్ హోల్డర్ల మధ్య తొలిసారి వేరువేరుగా మీడియా హక్కులను బీసీసీఐ వేలం వేసింది. ఐపీఎల్ టీవీ రైట్స్ హక్కులు రూ. 23,575 కోట్లకు డిస్నీ స్టార్ గెలుచుకుంది. డిజిటల్ రైట్స్ వయాకామ్ 18 సంస్థ 23,758కోట్లకు దక్కించుకుంది.
ఇక తర్వాతి సెషన్ టోర్నమెంట్ లో మ్యాచ్ ల సంఖ్య 74 నుంచి 94 పెంచారు. తదనుగుణంగా దాని విలువ పెరుగుతుందని ఐపీఎల్ వర్గాలు చెబుతున్నాయి. టిక్కెట్ల సేల్స్, ఇన్ స్టేడియం రెవెన్యూ రూపంలో ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆడుతున్న టీమ్ ల విలువ 400 – 600 మిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- హూతీల భీకర దాడి.. 53 మంది యెమెన్ సైనికులు మృతి
- నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు (బాలల) నిర్వహణ తేదీల మార్పు
- భారత్–న్యూజిలాండ్ మధ్య రేపటి నుంచే FTA అమలు
- ఫ్లైదుబాయ్ విమాన ఘటన పై స్పందించిన భారత పైలట్ స్మిత్ మచ్చర్
- దుబాయ్‌లో ఘనంగా ఐపీఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ బతుకమ్మ సంబరాలు
- ఫ్యూచర్‌సిటీకి కొత్త పోలీస్ కమిషనరేట్.. ప్రారంభించిన సీఎం రేవంత్
- మలేషియాలో ఘనంగా MYTA 13వ గ్రాండ్ బతుకమ్మ వేడుకలు
- దుబాయ్‌లో నకిలీ అనారోగ్య సెలవు ధ్రువపత్రాల జారీ.. క్లినిక్ క్లర్క్‌కు జైలు శిక్ష
- నో పార్కింగ్ ప్రాంతాల్లో వాహనాలు నిలిపితే వీల్ క్లాంప్లు..!!
- డిజిటల్, ఏఐ రంగాల్లో సహకారంపై బహ్రెయిన్, సౌదీ చర్చలు..!!







