యూనివర్సిటీ అడ్మిషన్ల నిబంధనల్లో కీలక మార్పులు

- December 22, 2022 , by Maagulf
యూనివర్సిటీ అడ్మిషన్ల నిబంధనల్లో కీలక మార్పులు

యూఏఈ: విశ్వవిద్యాలయాలలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకు ఎమిరేట్స్ స్టాండర్డ్ టెస్ట్ (EmSAT), బ్రిడ్జింగ్ కోర్సుల నుండి మినహాయింపు ఇవ్వవచ్చని విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ప్రకటించింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఎమిరేట్స్ స్టాండర్డ్ టెస్ట్ (EmSAT) జాతీయ స్థాయిలో నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష. దీనిద్వారా దేశంలో, వెలుపల ఉన్న ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో అడ్మిషన్లు అందిస్తారు. యూఏఈ విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందేందుకు ఈ పరీక్ష ఉత్తీర్ణత తప్పనిసరి. తాజాగా సర్క్యులర్ నంబర్ 137 ద్వారా హైస్కూల్ గ్రాడ్యుయేట్‌లకు ఈ ఎగ్జామ్ నుంచి మినహాయింపునిచ్చారు. అయితే షరతులతో కూడిన ప్రవేశాన్ని అందించవచ్చని తాజా సర్క్యులర్లో పేర్కొన్నారు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com