సౌదీ క్లబ్ తరపున ఆడనున్న క్రిస్టియానో రొనాల్డో!
- December 22, 2022
సౌదీ: పోర్చుగీస్ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో 2023 జనవరి 1 నుండి సౌదీ క్లబ్ అల్ నాసర్ తరపున ఆడనున్నాడని స్పానిష్ మీడియా తెలిపింది. పోర్చుగీస్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో సౌదీ అరేబియా క్లబ్ తో రెండున్నర సంవత్సరాల ఒప్పందంలో జనవరి నుంచి చేరనున్నారు. 37 ఏళ్ల స్ట్రైకర్ సంవత్సరానికి $217 మిలియన్ల ఒప్పందానికి అంగీకారం కుదిరిందట. ఖతార్‌లో జరిగే ప్రపంచ కప్‌కు కొద్ది రోజుల ముందు స్ట్రైకర్ మాంచెస్టర్ యునైటెడ్‌తో తన సంబంధాన్ని తెంచుకున్న విషయం తెలిసిందే.
అతడిని దక్కించుకోవడానికి క్లబ్‌లు ఆసక్తి చూపిన అల్-నాస్ర్ మొదటి నుండి ఎక్కువ ఆసక్తిని కనబరిచింది. అల్ నాసర్‌తో రొనాల్డో ఒప్పందం మొత్తం విలువ ఒక్కో సీజన్‌కు దాదాపు 200 మిలియన్ యూరోలు ఉంటుందని మీడియా కథనాలు చెబుతున్నాయి.
పారిస్ సెయింట్-జర్మైన్‌లో లియోనెల్ మెస్సీ, నెయ్‌మార్‌లు ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నారు. ప్రతి సీజన్‌లో వారు సంపాదించే 75 మిలియన్ యూరోలు సౌదీ అరేబియాలో క్రిస్టియానో పొందే దానికంటే చాలా తక్కువ. యునైటెడ్ స్టేట్స్‌లో అత్యధిక పారితోషికం పొందే అథ్లెట్ల జాబితాను కూడా పరిశీలించినా వారందరూ రొనాల్డొ సంపాదన కంటే చాలా తక్కువగా ఉన్నారు.
తాజా వార్తలు
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం
- యూఏఈలో ఘనంగా సంక్రాంతి వేడుకలు
- ఒక్కరోజు విరామం తీసుకుందామంటే ఏదో ఒక పని పడుతోంది: సీఎం రేవంత్
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్







