నిఖిల్ సుడిగాడే సుమా.! మళ్లీ కొట్టాడుగా.!
- December 24, 2022
నిఖిల్ సిద్దార్ద్‌కి సుడి మామూలుగా లేదండోయ్. ‘కార్తికేయ 2’ సినిమాకి అనూహ్యమైన సక్సెస్ కట్టబెట్టారు. వాయిదాల మీద వాయిదాలు పడిన సినిమా ‘కార్తికేయ 2’. అన్ని సార్లు వాయిదాలు పడిన సినిమాపై ఇంపాక్ట్ చాలా ఎక్కువగా వుంటుంది. అందుకే ఈ సినిమా విషయంలో నిఖిల్ కంట తడి పెట్టుకుని బాగా ఎమోషన్ అయ్యాడు కూడా.
కానీ, టైమే కలిసొచ్చిందో. లేక సింపథీ వర్కవుట్ అయ్యిందో తెలీదు కానీ, ‘కార్తికేయ 2’ రికార్డులు సృష్టించింది. ప్యాన్ ఇండియా గుర్తింపు కట్టబెట్టింది నిఖిల్‌కి.
ఇక, ఈ జోష్‌లోనే ‘18 పేజెస్’ రిలీజ్ అయ్యింది. పెద్దగా బజ్ లేకున్నా, ఈ సినిమాకి లక్కు బాగా కలిసొచ్చింది. ఫస్ట్ డేనే పాజిటివ్ టాక్ వచ్చింది. దాంతో, ‘18 పేజెస్’ కూడా హిట్ లిస్టులో చేరిపోయింది.
కూల్ అండ్ లవ్లీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ‘18 పేజెస్’ సక్సెస్ బాట పట్టింది. మాస్ రాజా రవితేజ ‘ధమాకా’ వంటి పెద్ద సినిమా వున్నప్పటికీ దాంతో పోటీపడి రేసులో గెలిచిందని.. నిఖిల్ ప్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాలకు వాతావరణ హెచ్చరిక.. 7 రోజుల పాటు భారీ వర్షాలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్‌లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం







