‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో జాయిన్ అయిన బాలీవుడ్ నటుడు.!
- December 24, 2022
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతోన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వేసవిలో సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్.
కాగా, ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ ఓ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ‘హరిహర వీరమల్లు’ సెట్స్‌లో బాబీ డియోల్ జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా ఓ వీడియో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాబీ డియోల్ పాత్ర ఎలా వుండబోతోందో అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎ.ఎమ్ రత్నం నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!







