పవన్, బాలయ్య మీట్.! అసలు మ్యాటర్ ఏంటంటే.!
- December 24, 2022
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నందమూరి నటసింహం బాలయ్య భేటీ అయ్యారు. ఇందులో పెద్దగా చిత్రమేముందంటారా.? కేవలం సినీ నటులే కాదు వీళ్లిద్దరూ. రాజకీయ ప్రముఖులు కూడా.
అందులోనూ రెండు వేర్వేరు పార్టీల నేతలు. అందుకే ఈ మీట్ ఇప్పుడు విడ్డూరమైంది. అయితే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే బాలయ్య ‘వీర సింహారెడ్డి’ సినిమాలో నటిస్తున్నాడు.
ఈ రెండు సినిమాల షూటింగులూ పక్క పక్కనే జరుగుతుండడంతో ఈ ఇద్దరూ కలిశారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీలో బాలయ్య, శృతిహాసన్ మధ్య ఓ సాంగ్ షూట్ జరుగుతోంది ఈ సెట్లో. ఓ స్టూడియోలో ఈ షూటింగ్ జరుగుతోంది. అదే స్టూడియోలో వీరమల్లు షూటింగ్ కూడా జరుగుతోంది. విరామ సమయంలో బాలయ్యను కలిసేందుకు వెళ్లారు పవన్. వీరమల్లు ప్రొడ్యూసర్ ఎ.ఎమ్.రత్నం, దర్శకుడు క్రిష్ కూడా పవన్‌తో వున్నారు. సాదరంగా పవన్‌ని ఆహ్వానించి, కాసేపు సరదాగా ముచ్చటించారు వీర సింహం బాలయ్య.
అన్నట్లు త్వరలోనే పవన్ కళ్యాణ్, బాలయ్య.. ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షోలో కలవబోతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్‌లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్‌ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్‌లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు







