ఏపీలో త్వరలోనే బీఆర్ఎస్ కార్యక్రమాలు ప్రారంభం
- December 24, 2022
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ త్వరలోనే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేందుకు బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల నుంచి వివిధ కార్యక్రమాలకు పార్టీ రూపకల్పన చేస్తోంది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు, దీని కోసం ఓ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రారంభించనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పనుల పర్యవేక్షణ ఉంటుందని, జనవరి చివరలో కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం కానుందని వెల్లడించాయి. అమరావతిలో పార్టీ భనవ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన బీఆర్ఎస్.. తాత్కాలిక కార్యాలయం నుంచే పార్టీ కార్యక్రమాలు ప్రారంభించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ నెల 26 లేదా 27న ఏపీకి చెందిన కొందరు నేతలు కేసీఆర్ ను కలిసే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఇస్రో బాహుబలి రాకెట్ ఘన విజయం
- టీ20 సిరీస్.. టీమిండియా ఘన విజయం
- రికార్డు సృష్టించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ప్రారంభోత్సవం..!!
- సౌదీ అవినీతి నిరోధక సంస్థ అదుపులో 478 మంది..!!
- అబుదాబిలో క్వాడ్ బైక్‌లు, ఇ-స్కూటర్లపై dh50,000 ఫైన్..!!
- అల్-ఖైరాన్‌లో 467 ఉల్లంఘనలు, పలువురు అరెస్ట్..!!
- నవంబర్ 5న బహ్రెయిన్ ఆకాశంలో సూపర్ మూన్..!!
- ఒమన్ లో నిలిచిన తలాబత్ డెలివరీ సేవలు..!!
- బీఆర్ఎస్ కార్యాలయం పై దాడి ఘటన..
- జోగి రమేశ్ అరెస్ట్‌పై వైఎస్ జగన్ కీలక కామెంట్స్..







