ప్రబాస్-సుకుమార్ ఎప్పటికి వర్కవుట్ కావాల.!
- December 26, 2022‘బాహుబలి’ సినిమా తర్వాత ఎంత ప్రయత్నించినా ఆ సక్సెస్‌ని చేరుకోలేకపోతున్నాడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. అన్నీ భారీ బడ్జెట్, ప్యాన్ ఇండియా సినిమాలే. కానీ, ఒక్క హిట్టు కూడా కట్టబెట్టడం లేదు అభిమానులు ప్రబాస్‌కి.
అయినా తగ్గేదే లే.! అంటున్నాడు ప్రబాస్. ప్రస్తుతం ప్రబాస్ చేతిలో నాలుగైదు ప్రాజెక్టులున్నాయ్. ‘ఆదిపురుష్’ ఆల్రెడీ పూర్తయిపోయింది. ‘ప్రాజెక్ట్ కె’ సెట్స్‌పై వుంది. ‘సలార్’ దాదాపు చివరి దశ షూటింగ్‌లో వుంది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో ‘స్పిరిట్’ అనే సినిమా చేయాల్సి వుంది.
దీంతో పాటూ మారుతితో హారర్ సినిమా కూడా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నాడు బాహుబలి. వీటన్నింటితోనూ తాజాగా సుకుమార్ ప్రాజెక్ట్ ఒకటి తెరపైకి వచ్చింది. సుకుమార్‌తో ఓ క్రియేటివ్ ప్రాజెక్ట్ ప్రబాస్ ఓకే చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఆ ప్రాజెక్ట్ వివరాలేంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయినా ఇన్ని సినిమాలు పూర్తి చేసుకుని సుక్కుతో ప్రబాస్ ఎప్పటికి సినిమా చేయాలి. అందులోనూ సుక్కు మాస్టర్, ‘పుష్ప 2’ పూర్తి చేస్తే కానీ, తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పుడప్పుడే ఫోకస్ పెట్టలేడన్నది తెలిసిందే. చూడాలి మరి.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







