తూచ్.! అదంతా వుత్తదే అని తేల్చేసిన త్రిష.!
- December 26, 2022
సీనియర్ నటి త్రిష.. ఇప్పటికీ తనదైన శైలిలో హీరోయిన్‌గా చెలామనీ అవుతోంది. ఎంతమంది కొత్త భామలున్నా.. హీరోయిన్‌గా త్రిషకున్న క్రేజ్ ఎంతమాత్రమూ తగ్గలేదు.
అయితే, తమిళంలో మాత్రమే ప్రస్తుతం త్రిష సినిమాలు చేస్తోంది. తెలుగు నుంచి కూడా ఆఫర్లు వస్తున్నా డేట్లు అడ్జస్ట్ చేయలేక ఆ ఆఫర్లు వదులుకుంటోంది. మెగాస్టార్ చిరంజీవితో ఈ మధ్య ఓ ఆఫర్ అలాగే వదులుకుంది త్రిష.
‘పొన్నియన్ సెల్వన్ 1’ సినిమా త్రిషకు ఇటీవల మంచి పేరు తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మరిన్ని తమిళ ప్రాజెక్టులు త్రిష చేతిలో వున్నాయ్. కాగా, ఇటీవల త్రిషపై ఓ రూమర్ దూసుకొచ్చింది. త్వరలో పాలిటిక్స్‌లో త్రిష చక్రం తిప్పబోతోందనేది ఆ ప్రచారం తాలూకు సారాంశం.
అయితే, అదంతా వుత్త ప్రచారమే అని త్రిష తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. తన ఫోకస్ అంతా సినిమాల పైనే. ఇప్పట్లో అయితే రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి తనకు లేదని త్రిష తేల్చేసింది. దాంతో, త్రిష పొలిటికల్ వార్తలకు చెక్ పడినట్లయ్యింది.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్‌లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్‌లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







