ఐపీఎల్ ఆల్-టైమ్ వేలం రికార్డును బద్దలుకొట్టిన సామ్ కుర్రాన్
- December 26, 2022
న్యూఢిల్లీ: 2023 మార్చిలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరో సీజన్ ప్రారంభం కానుంది. రాబోయే సీజన్ కోసం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో 10 జట్లు పోటాపోటీగా పాల్గొన్నాయి. ఈ వేలంలో ఇంగ్లండ్ ఆల్-రౌండర్ సామ్ కుర్రాన్ ఐపీఎల్ చరిత్రలో ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. IPL చరిత్రలో ఇప్పటివరకు అత్యంత ఖరీదైన ఆటగాళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1. సామ్ కుర్రాన్ – 185 మిలియన్లు
ఇంగ్లండ్ ఆల్-రౌండర్ సామ్ కుర్రాన్ శుక్రవారం ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలంలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డులు సృష్టించాడు. పంజాబ్ కింగ్స్ అతనిని 185 మిలియన్లు ($2.23 మిలియన్లు) ధర చెల్లించి కొనుగోలు చేసింది.
2. కామెరాన్ గ్రీన్ – 175 మిలియన్లు
ఏ ఏడాది కామెరాన్ గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ రూ.175 మిలియన్లకు కొనుగోలు చేసింది. అతడిని దక్కించుకోవడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీ పడ్డాయి.
3. బెన్ స్టోక్స్ – 162.5 మిలియన్లు
రాబోయే సీజన్లో ఐపీఎల్లో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ఒకడిగా బెన్ స్టోక్స్ నిలిచాడు. ఈ సంవత్సరం ఇంగ్లండ్ T20 విజయంలో స్టోక్స్ ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో స్టోక్స్ ను దక్కించుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధర చెల్లించుకునేందుకు ముందుకొచ్చింది.
క్రిస్ మోరిస్ – 162.5 మిలియన్లు
2021లో క్రిస్ మోరిస్‌ను రాజస్థాన్ రాయల్స్ 162.5 మిలియన్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
4. నికోలస్ పూరన్ – 160 మిలియన్లు
2023 సీజన్ కోసం నికోలస్ పూరన్ కు 160 మిలియన్లు చెల్లించి లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. పూరన్ లీగ్ చరిత్రలో అత్యంత ఖరీదైన వికెట్ కీపర్‌గా నిలిచి మరో రికార్డును బద్దలు కొట్టాడు.ఈ వెస్టిండీస్ ఆటగాడు ఇప్పటి వరకు IPLలో 151.24 స్ట్రైక్ రేట్‌తో 26.06 సగటుతో పరుగులు చేశాడు.
5. యువరాజ్ సింగ్ – 160 మిలియన్లు
ఆరు బాల్స్ లో ఆరు సిక్సర్లు కొట్టి రికార్డులు సృష్టించిన ఎడమచేతి వాటం ఆటగాడు యువరాజ్ సింగ్ ను 2015లో 160 మిలియన్లకు ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పట్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) జట్టులోకి తీసుకున్నది. అయితే, యూవీ ఆ సీరిస్ లో 118.09 స్ట్రైక్ రేట్‌తో 19.07 సగటుతో పరుగులు సాధించి అంచనాలను అందుకోలేకపోయాడు.
తాజా వార్తలు
- సూపర్ వీసా ప్రాసెసింగ్ ను వేగవంతం చేసిన కెనడా
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరల పై కీలక ప్రకటన..
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్‌సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..







