వివాహిత ఫోటోలు, వీడియోలు తీసిన వ్యక్తికి జైలు శిక్ష
- December 27, 2022
దుబాయ్: వివాహిత అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీసిన 26 ఏళ్ల వ్యక్తికి క్రిమినల్ కోర్ట్ రెండు నెలల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత దేశం నుండి బహిష్కంచాలని ఆదేశించింది. నిందితుడు చెక్క గోడలోని రంద్రం ద్వారా వివాహిత పడుకున్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసినట్లు కోర్టు ఫైల్స్ చెబుతున్నాయి. ఈ విషయాన్ని గమనించిన వివాహిత భర్త నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. అనంతరం నిందితుడి ఫోన్ నుంచి దాదాపు 25 సెకన్ల నిడివి గల వీడియో రికార్డింగ్, పలు ఫోటోలను పోలీసులు గుర్తించారు. అతన్ని అరెస్టు చేసి, దుబాయ్‌లోని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు రిఫర్ చేశారు. జంట గోప్యతపై దాడి చేశారనే ఆరోపణలపై అతన్ని కోర్టుకు పంపింది.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







