పర్యాటకులను ఆకర్షించేలా ‘గలాలీ బీచ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌’

- December 27, 2022 , by Maagulf
పర్యాటకులను ఆకర్షించేలా ‘గలాలీ బీచ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌’

బహ్రెయిన్: 2022-2026 బహ్రెయిన్ పర్యాటక వ్యూహంలో భాగంగా అన్ని పర్యాటక ప్రాజెక్టుల అమలును పర్యవేక్షించినట్లు పర్యాటక మంత్రి ఫాతిమా బింట్ జాఫర్ అల్ సైరాఫీ తెలిపారు. ఇదే సమయంలో పర్యాటక రంగం అభివృద్ధికి అనేక ప్రాజెక్టులను పునరుద్ధరణ ప్రణాళికల్లో ఉందన్నారు. ఇవన్నిపర్యాటక రంగాన్ని సుసంపన్నం చేయడానికి, బహ్రెయిన్ ఎకనామిక్ విజన్ 2030కి అనుగుణంగా పర్యాటకులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. గలాలీ బీచ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అభివృద్ధి, దశలను ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సమీక్షించి పరిశీలించారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పర్యాటక మ్యాప్‌లో బహ్రెయిన్ స్థానాన్ని బలోపేతం చేసే అనేక రకాల సేవలు, రెస్టారెంట్లు, వినోదాలను ఈ ప్రాజెక్ట్ కలిగి ఉంటుందని అల్ సైరాఫీ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com