ప్రధాని మోడీతో సిఎం జగన్ సమావేశం
- December 28, 2022
న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో సిఎం జగన్ భేటీ అయ్యారు. రెండ్రోజుల పర్యటనలో భాగంగా నిన్న రాత్రి ఢిల్లీకి వచ్చిన జగన్ కొద్దిసేపటి క్రితం ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతోపాటు, పెండింగ్ బకాయిలు, పోలవరం సహా పలు ప్రాజెక్టుల గురించి, ముఖ్యంగా రాష్ట్ర విభజన హామీల గురించి, అలాగే మూడు రాజధానుల అంశాన్ని ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. సిఎం జగన్ సుమారు 50 నిమిషాల పాటు ప్రధాని నివాసంలో ఉన్నారు.
సీఎం జగన్ తోపాటు వైఎస్‌ఆర్‌సిపి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత వైఎస్ అవినాశ్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఉన్నారు. ప్రధానితో భేటీ ముగిశాక మధ్యాహ్నం కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తోనూ జగన్ భేటీ కానున్నట్లు సమాచారం. అలాగే రాత్రి 10గంటలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ సీఎం జగన్ సమావేశం అయ్యేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







