ఈ నెల 30న యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు రద్దు
- December 28, 2022
హైదరాబాద్: ప్రముఖ ఆలయం యాద్రాద్రిలో ఈ నెల 30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం.. ఉదయం సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు వరకు నిర్వహించే ఆర్జిత సేవలు, ప్రత్యేక, ధర్మదర్శనాలను రద్దు చేస్తున్నామని ఆలయ ఈవో గీత చెప్పారు. అదేవిధంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు బ్రేక్ దర్శనాలను కూడా క్యాన్సల్ చేస్తున్నామని వెల్లడించారు. నిత్యకైంకర్యాలను ఆంతరంగికంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు యాదాద్రీశ్వరుడిని నలుగురు రాష్ట్రపతులు మాత్రమే దర్శించుకోవడం విశేషం.
కాగా, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారన్న సమాచారంతో గతంలో యాదగిరీశుడిని దర్శించుకున్న రాష్ట్రపతులపై చర్చ సాగుతున్నది. తొలి రాష్టపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్, 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణణ్, 9వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్‌దయాల్‌శర్మ, 13వ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా 15వ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నారసింహుడిని దర్శించుకోనున్నారు.
తాజా వార్తలు
- వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు.. నేపాల్‌కు భారత్ రెస్క్యూ బృందాల సహకారం
- అబుదాబిలో ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ మహమ్మద్
- యూఏఈలో అనధికార ఆన్లైన్ ఫత్వా ఖాతాల పై చర్యలు..
- సెంచరీతో చెలరేగిన డీజీపీ సీవీ ఆనంద్..
- యూఏఈలో పర్సనల్ లోన్ చెల్లింపులు నిలిచిపోతే ఏమవుతుంది?
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం







