‘ఖుషీ’ రీ రిలీజ్.! సంతోషంలో ‘పవర్’ ఫ్యాన్స్.!
- December 28, 2022
మొన్న పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా ‘జల్సా’ మూవీని రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రీ రిలీజ్ అనే తేడా లేకుండా, ఈ సినిమా చూసేందుకు జనం పోటెత్తారు. రీ రిలీజ్‌లోనూ భారీగా వసూళ్లు పోటెత్తాయ్ ఈ సినిమాకి.
ఇక, తాజాగా ‘ఖుషీ’ సినిమా రీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయ్. డిశంబర్ 31న ‘ఖుషీ’ రిలీజ్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయ్. ‘ఖుషీ’ అప్పట్లో ఓ సంచలనం. తెలుగు సినిమా తీరు తెన్నుల్ని మార్చిన సినిమా ‘ఖుషీ’.
టాలీవుడ్ సినిమాల్లో ఓ డిఫరెంట్ మూవీగా ‘ఖుషీ’ మూవీని అభివర్ణిస్తుంటారు. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ‘ఖుషీ’ రీ రిలీజ్.. అది కూడా న్యూ ఇయర్ సందర్భంగా వస్తుందంటే, ఫ్యాన్స్‌లో ఖుషీ మామూలుగా లేదు. ఎప్పుడో ప్రీ బుకింగ్స్ అయిపోయాయ్. కావాలన్నా టిక్కెట్లు దొరకడం లేదట. అదీ పవర్ మేనియా.
ఈ సినిమా ద్వారా వచ్చిన వసూళ్లను ఛారిటీ కోసం వినియోగిస్తున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







