పవన్‌తో బాలయ్య అన్‌స్టాపబుల్.! అంతకు మించి.!
- December 28, 2022
‘ఆహా’ ఓటీటీ వేదికగా వస్తున్న ‘అన్‌స్టాపబుల్ 2’ టాక్ షో విశేషమైన ఆదరణ పొందుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య పంచ్ డైలాగ్‌లు, ప్రముఖ సెలబ్రిటీలతో ఫన్నీగా ఇంట్రెస్టింగ్గా సాగుతున్న ఈ టాక్ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షోగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
కాగా, తొలి సీజన్‌తో పోల్చితే, రెండో సీజన్‌ని మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. అందుకు రెండో సీజన్లో ఈ టాక్ షోలో పాల్గొంటున్న సెలబ్రిటీలే కారణం.
ఇటీవలే ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్‌తో షూటింగ్ పూర్తి చేశాడు బాలయ్య. ఆ ఎపిసోడ్ ఈ నెల 30న ప్రసారం కానుంది. ఆ ఎపిసోడ్‌కి సంబంధించి ఇప్పటికే వదిలిన ప్రోమోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
అలాగే, త్వరలో పవన్ కళ్యాణ్ ఈ షోకి రాబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఆ రోజు రానే వచ్చింది. పవన్‌కి సంబంధించిన ఎపిసోడ్ చిత్రీకరణ మంగళవారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
అందుకు సంబంధించిన లీకు వీడియోలు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయ్. ఈ సీజన్ మొత్తానికి ఇదే హైలైట్ ఎపిసోడ్ అవుతుందంటున్నారు. అలాగే, సినీ విశేషాలే కాకుండా, రాజకీయ అంశాలు కూడా పవన్, బాలయ్య మధ్య ఈ టాక్ షోలో చర్చకు వచ్చే అవకాశాలుంటాయని ఈ ఎపిసోడ్ గురించి అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







