120 మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడ్డ రష్యా
- December 29, 2022
కివ్: మరోసారి ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. 120 మిస్సైళ్లతో అటాక్ చేసింది. ఉక్రెయిన్ దేశవ్యాప్తంగా ఎయిర్ రెయిడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ దేశంలోని ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ రష్యా దాడి చేసినట్లు స్పష్టమవుతోంది. ప్రజలు, మౌళికసదుపాయాలనే రష్యా లక్ష్యం చేసినట్లు అధ్యక్ష సలహాదారు మైఖేల్ పొడోయాక్ తెలిపారు. ఈ దాడిలో కనీసం ముగ్గురు మృతిచెందినట్లు తెలుస్తోంది. కీవ్‌లో క్షిపణులు పడినట్లు ఆ నగర మేయర్ విటాలీ క్లిచ్‌కోవ్ తెలిపారు. ఖార్కీవ్, ఒడిసా, లివివ్, జైటోమిర్ నగరాల్లోనూ భారీ స్థాయిలో పేలుళ్ల శబ్ధాలు వినిపించాయి. ఉక్రెయిన్‌పై భారీ స్థాయిలో మిస్సైల్ అటాక్ జరిగినట్లు ఒడిసా ప్రావిన్సు నేత మాక్సిమ్ మార్చెంకో తెలిపారు. వివిధ దిశల నుంచి వైమానిక, నౌకా స్థావరాల మీదుగా క్రూయిజ్ మిస్సైళ్లను రష్యా వదిలినట్లు ఉక్రెయిన్ వైమానిక దళం పేర్కొన్నది. కమికేజ్ డ్రోన్లను కూడా వాడినట్లు ఉక్రెయిన్ పేర్కొన్నది.
కీవ్ నగరంలో సుమారు 16 క్షిపణులను తిప్పికొట్టారు. అయితే మిస్సైళ్లను ఢీకొట్టడం వల్ల శిథిలాలు ఇండ్లపై పడ్డాయి. మైకోలేవ్ ప్రాంతంలో అయిదు మిస్సైళ్లను ఇంటర్‌సెప్ట్ చేసినట్లు అక్కడి గవర్నర్ తెలిపారు. ఒడిసా ప్రాంతంలో 21 మిస్సైళ్లను కూల్చినట్లు అధికారి చెప్పారు. మిస్సైళ్ల శిథిలాలు ఇండ్లపై కూలడంతో కొందరు గాయపడ్డారు. లివివ్ నగరంలోనూ భారీ పేలుడు శబ్ధాలు పలుమార్లు వినిపించినట్లు మేయర్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్







