బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
- December 29, 2022
న్యూ ఢిల్లీ: యుద్ధ విమానాల నుంచి ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచి భారత్ ఇవాళ చేసిన ప్రయోగం విజయవంతమైంది.400 కిలోమీటర్ల దూరంలోని నిర్దేశిత లక్ష్యాన్ని అది ఛేదించిందని రక్షణ శాఖ అధికారులు చెప్పారు. ఎస్యూ-30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన బ్రహ్మోస్ క్షిపణి నిర్దేశిత ఓడను ధ్వంసం చేసిందని తెలిపారు. ఇది గగనతలం నుంచి నౌకలను ధ్వంసం చేయగలిగే వెర్షన్ క్షిపణి అని చెప్పారు.
బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని ఈ క్షిపణి కచ్చితత్వంతో ఛేదించిందని వివరించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. ఎస్యూ-30ఎంకేఐ యుద్ధ విమానాల నుంచి భూతల, సముద్రతల సుదీర్ఘ లక్ష్యాలను మరింత కచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం భారతీయ వైమానిక దళం సంపాదించినట్లయిందని అధికారులు తెలిపారు.
భారతీయ వైమానిక దళం వ్యూహాత్మకంగా తమ లక్ష్యాలను ఛేదించడానికి, భవిష్యత్తుల్లో యుద్ధాల్లో శత్రుదేశాలపై పై చేయి సాధించడానికి ఈ కొత్త వెర్షన్ బ్రహ్మోస్ క్షిపణి మరింత ఉపయోగపడుతుందని వివరించారు. ఈ ప్రయోగం చేపట్టడానికి భారత వైమానిక దళం, నౌకా దళం, డీఆర్డీవో, బీఏపీఎల్, హల్ కృషి చేశాయని చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి లక్ష్య పరిధిని పెంచుకుంటూ భారత్ ఇప్పటికే అనేక విజయాలు సాధించింది. ఈ ఏడాది మేలోనూ ఎస్యూ-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి భారత్ బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగం చేపట్టి విజయవంతమైంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







