స్టాక్ మానిప్యులేషన్.. SR2.15 మిలియన్ల జరిమానా
- December 29, 2022
రియాద్: స్టాక్ మార్కెట్ నుండి స్టాక్ మానిప్యులేషన్ ద్వారా పొందిన 55 మిలియన్ డాలర్లకు పైగా అక్రమ లాభాలను తిరిగి చెల్లించాలని సౌదీ కోర్టు ఒక పౌరుడికి శిక్ష విధించిందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ప్రకటించింది. ఎకనామిక్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ పౌరుడిపై స్టాక్ మార్కెట్ కార్యకలాపాలు, షేరు ధరను తారుమారు చేసే పద్ధతులకు పాల్పడినట్లు అభియోగాలు మోపింది. అధిక ముగింపు ధరను సాధించడానికి పౌరుడు 43 సార్లు కొనుగోలు ఆర్డర్‌లను నమోదు చేసినట్లు పరిశోధనలు వెల్లడించాయి. పౌరుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. కోర్టు పౌరుడిని దోషిగా నిర్ధారించింది. SR55 మిలియన్లకు పైగా ఉన్న అక్రమ లాభాలను తిరిగి చెల్లించాలని అదేశించింది. అలాగే స్టాక్ మానిప్యులేషన్ కు పాల్పడినందుకు SR2.15 మిలియన్ల జరిమానా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. తడావుల్-లిస్టెడ్ కంపెనీల షేర్లను తన సొంత ఖాతా కోసం లేదా ఇతరుల తరపున ప్రాక్సీ ద్వారా ట్రేడింగ్ చేయకుండా పౌరుడిని నిరోధించాలని అధికారులకు సూచించింది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం