12 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్.! ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే.!
- December 29, 2022
నాగ చైతన్య, సమంత కాంబినేషన్లో వచ్చిన ‘ఏ మాయ చేశావె’ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమా ద్వారానే సమంత హీరోయిన్గా పరిచయమైంది.
అక్కడి నుంచే చై, సామ్ మధ్య స్నేహం కూడా విరిసింది. ఆ స్నేహమే ప్రేమగా పెరిగి పెద్దదై పెళ్లి వరకూ వెళ్లింది. పెళ్లయిన నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారనుకోండి.
అసలు మ్యాటర్ ఏంటంటే, 12 ఏళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ రాబోతోందట. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత మంచి కాన్సెప్ట్‌తో సీక్వెల్ రూపుదిద్దుకుంటోందట. ఆల్రెడీ స్క్రిప్టు పనులు పూర్తయ్యాయనీ సమాచారం.
ట్విస్ట్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో నాగచైతన్యే కానీ, హీరోయిన్ సమంత కాదంట. రష్మికను హీరోయిన్గా తీసుకోబోతున్నారనీ తెలుస్తోంది. చై, సామ్ పర్సనల్ లైఫ్‌కి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలను ఈ సీక్వెల్లో చూపించబోతున్నారనీ టాక్ నడుస్తోంది.చూడాలి మరి.ఇది జస్ట్ ప్రచారమేనా.? నిజంగానే వారి వైవాహిక, విడాకుల జీవితానికి సంబంధించిన ఆసక్తికరమైన అంశాలను చూపిస్తారా.? అన్నది తెలియాలంటే ఇంకా చాలా టైమ్ వెయిట్ చేయాల్సి వుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







