పెను ప్రమాదం నుండి బయటపడ్డ క్రికెటర్ రిషభ్ పంత్
- December 30, 2022
న్యూ ఢిల్లీ: టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి వెళ్తుండగా పంత్ కారు ప్రమాదానికి గురైంది. ఉత్తరాఖండ్ రూర్కీలోని నర్సన్ సరిహద్దులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కార్ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పంత్‌కు గాయాలు కావడంతో.. హుటాహుటిన స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి ఢిల్లీకి తరలించారు.
ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీకి తన మెర్సిడెస్ బెంజ్ కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో కారును స్వయంగా పంత్ డ్రైవ్ చేస్తున్నాడు. ఉత్తరాఖండ్ లోని రూర్కీ సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారులో పంత్ మాత్రమే ఉన్నాడని ఉత్తరాఖండ్ డీజీపీ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయని… ఈ క్రమంలో, కారు అద్దాలను పగులగొట్టి, వాహనం నుంచి పంత్ బయటకు వచ్చారని వెల్లడించారు.
ఈ ప్రమాదంలో పంత్ తలకు, మోకాలికి గాయాలయ్యాయి. వీపు భాగం కాలింది. కాలికి ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఆయనను రూర్కీ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ లోని ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. డ్రైవ్ చేస్తున్న సమయంలో ఒక క్షణం నిద్రలోకి జారుకోవడం వల్లే ప్రమాదం సంభవించిందని భావిస్తున్నారు. పంత్ ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







