ఆ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్రం తాజా మార్గదర్శకాలు
- December 30, 2022
న్యూ ఢిల్లీ: విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని తప్పనిసరిగా అనుసరించాల్సి ఉంటుంది. చైనా, హాంగ్ కాంగ్, జపాన్, దక్షిణ కొరియా, సింగపూర్, థాయిలాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి.
జనవరి 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఆయా దేశాల్లో కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి మార్గదర్శకాల్లో మార్పులు చేసింది. ప్రకటించిన ఈ దేశాల నుంచి వచ్చే వారు, నిర్ణీత ప్రయాణ సమయానికి 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష విధిగా చేయించుకుని, రిపోర్ట్ తో రావాల్సి ఉంటుంది. ఇక విదేశాల నుంచి వచ్చే మొత్తం ప్రయాణికుల్లో 2 శాతం మందికి ర్యాండమ్ గా ఇక్కడి విమానాశ్రయాల్లో నిర్వహించే ఆర్టీపీసీఆర్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్‌లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్‌లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్‌లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!







