ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్..
- December 30, 2022
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ డిసెంబర్31తో ముగుస్తుండగా తక్కువ ధరలో అందుబాటులో ఉన్న డివైజ్‌లను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా ఈ కామర్స్ దిగ్గజం పిక్సెల్ 6ఏ, ఐఫోన్ 13, నథింగ్ ఫోన్ (1) ఇతర 5జీ ఫోన్లపై ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. 2022 లో విడుదల చేసిన ఫోన్లపైన కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఇయర్ ఎండ్ సేల్‌లో ఐఫోన్ 13పై భారీ తగ్గింపును ఈకామర్స్ దిగ్గజం ప్రకటించింది. ఐఫోన్ 14 సిరీస్‌ను పోలిన ఐఫోన్ 13ను లేటెస్ట్ ఆఫర్లు, డిస్కౌంట్లపై తక్కువ ధరకే పొందొచ్చు. ఐఫోన్ 13 128 జీబీ మోడల్ ఒరిజినల్ ప్రైస్ రూ.69,900 కాగా సేల్‌లో రూ.61,999కి లభిస్తోంది. దీంతో పాటు ఎక్సేంజ్ ఆఫర్, హెచ్డీఎఫ్సీ కార్డుదారులకు లభించే ఆఫర్లను మినహాయిస్తే అత్యంత ఆకర్షణీయ ధరకు ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. ఇక మెరుగైన కెమెరా సామర్థ్యం, వేగంగా పనిచేయడం కోసం శాంసంగ్ గెలాక్సీ ఎస్ 22+ 5జీ ఫోన్‌పైనా ఇయర్ ఎండ్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ హాట్ డివైజ్ రూ.69.999కి సేల్‌లో ఆఫర్ ఉండగా, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై పది శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్సేంజ్ ఆఫర్‌తో ఈ లేటెస్ట్ ఫోన్‌ను మరింత తక్కువ ధరకే పొందే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!