జమ్ముకశ్మీర్: ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు పౌరులు మృతి
- January 02, 2023
జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందారు. రాజౌరీలో అనుమానిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు. మరో 10 తొమ్మిది మంది గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలోని డాంగ్రీలో ఆదివారం ఇద్దరు సాయుధులు గ్రామస్థులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.
మూడు ఇళ్లపై కాల్పులు జరిగాయని, ఘటనాస్థలంలో ఇద్దరు పౌరులు మరణించగా మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ చెప్పారు. కాల్పులకు పాల్పడిన వారు ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
బాధితులను దీపక్ కుమార్, సతీష్ కుమార్, ప్రీతమ్ లాల్ గా గుర్తించారు. తుపాకీ గాయాలతో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పది మంది గాయపడినట్లు రాజౌరి మెడికల్ కాలేజీ వైద్యులు తెలిపారు. గాయపడిన వారిలో ఒకరు ఆసుపత్రిలో మరణించారని చెప్పారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
తాము వారి ప్రాణాలను రక్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. గత రెండు వారాల్లో జిల్లాలో పౌర హత్యలు జరగడం ఇది రెండోసారి. డిసెంబరు 16న రాజౌరిలోని సైనిక శిబిరం బయట ఇద్దరు పౌరులు మరణించారు.
తాజా వార్తలు
- భారత్లో త్వరలో 2 కొత్త ఎయిర్లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







