రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనలపై సంయుక్త తనిఖీలు

- January 02, 2023 , by Maagulf
రెసిడెన్సీ చట్టాల ఉల్లంఘనలపై సంయుక్త తనిఖీలు

మనామా: ముహరక్ గవర్నరేట్‌లో అంతర్గత మంత్రిత్వ శాఖ, ముహర్రాక్ గవర్నరేట్ పోలీసుల సమన్వయంతో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) సంయుక్త తనిఖీ ప్రచారాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా లేబర్ మార్కెట్, రెసిడెన్సీ చట్టాలకు సంబంధించిన అనేక ఉల్లంఘనలను గుర్తించినట్లు పేర్కొంది. వారందరిపై చట్టపరమైన చర్య కోసం సిఫార్సు చేసినటలు అథారిటీ తెలిపింది. వెబ్‌సైట్ www.lmra.bhలో ఎలక్ట్రానిక్ ఫారమ్‌ను పూరించడం ద్వారా లేదా 17506055 నంబర్ కు కాల్ చేయడం ద్వారా ఉల్లంఘనలను తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చింది. చట్టవిరుద్ధమైన కార్మిక పద్ధతులను పరిష్కరించడానికి ప్రభుత్వ ఏజెన్సీల ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ కోరింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com