'స్టాప్' సైన్ ఉల్లంఘిస్తే Dh1,000, 10 బ్లాక్ పాయింట్లు
- January 02, 2023
యూఏఈ:సెలవులు ముగియడంతో విద్యార్థులు పాఠశాలలకు తిరిగి వస్తున్నందున వాహనదారులు జాగ్రత్తగా నడపాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అబుధాబి పోలీసులు కోరారు. పాఠశాల బస్సులో విద్యార్థులను దింపుతున్నప్పుడు లేదా ఎక్కించేటప్పుడు 'స్టాప్' గుర్తు తెరిచినప్పుడు వాహనదారులు తమ వాహనాలను పూర్తిగా ఆపివేయాలని కోరారు. అబుధాబి పోలీసులు వాహనదారులకు 'స్టాప్' గుర్తును ప్రదర్శించినప్పుడు రహదారిపై వామనాలు ఆపాలని, విద్యార్థులు సురక్షితంగా వెళ్లేలా పాఠశాల బస్సు నుండి వాహనాలను ఐదు మీటర్ల దూరంలో నిలిపివేయాలని సూచించారు. హించాలని గుర్తు చేశారు. స్టాప్ సిగ్నల్ ను పట్టించుకోని వాహనదారులకు 1,000 దిర్హామ్‌ల జరిమానా విధించబడుతుందని, వారి లైసెన్స్‌లకు వ్యతిరేకంగా పది బ్లాక్ పాయింట్లు విధిస్తామని హెచ్చరించారు. అలాగే పాఠశాల బస్సు డ్రైవర్లు విద్యార్థులను ఎక్కించేటప్పుడు లేదా దింపుతున్నప్పుడు తప్పనిసారిగా 'స్టాప్' సంకేతాలను ప్రదర్శించాలన్నారు. అలా చేయని డ్రైవర్లకు 500 దిర్హామ్ జరిమానా, ఆరు బ్లాక్ పాయింట్లు విధిస్తామన్నారు. తల్లిదండ్రులు కూడా ట్రాఫిక్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని, పాఠశాలల వద్ద వాహనాలను పార్కింగ్ చేయడానికి నిర్దేశించిన స్థలాలను ఉపయోగించుకోవాలన్నారు.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







