రైతుల మార్కెట్‌ను సందర్శించిన 60,000 మంది
- January 02, 2023
బహ్రెయిన్: డిసెంబర్ 10న ప్రారంభమైన బహ్రెయిన్ రైతుల మార్కెట్ కు సందర్శకులు పోటెత్తారు.నాలుగు వారాల్లో సుమారు 60,000కుపైగా ప్రజలు, నివాసితులు, పర్యాటకులు సందర్శించారు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ (NIAD) భాగస్వామ్యంతో మునిసిపాలిటీల వ్యవహారాలు, వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఈ మార్కెట్‌ని నిర్వహిస్తుంది.ఈ సంవత్సరం ఎడిషన్‌లో బహ్రెయిన్ రైతులు, వ్యవసాయ కంపెనీలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతోపాటు కొత్త కార్యక్రమాలను ప్రవేశపెట్టడం మార్కెట్‌ను మరింత పెంచడానికి దోహదపడ్డాయని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత బహ్రెయిన్ రైతు మార్కెట్ తిరిగి ఊపందుకోవడంపై రైతులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బహ్రెయిన్ రైతుల మార్కెట్ ప్రతి శనివారం బుదయ్య బొటానికల్ గార్డెన్లో ఉదయం 07:00 నుండి మధ్యాహ్నం 01:00 వరకు జరుగుతుంది.
తాజా వార్తలు
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!
- జెబెల్ జైస్‌లో బేర్ గ్రిల్స్ క్యాంప్ రీ ఓపెన్..!!
- భారత్ తో CEPA..ఆందోళనల పై స్పందించిన ఒమన్..!!
- బహ్రెయిన్ లకే వెహికల్ టెక్నికల్ ఇన్స్పెక్టర్ పోస్టులు..!!
- రియాద్ మెట్రో వార్షిక, టర్మ్ టిక్కెట్ల ధరలు వెల్లడి..!!
- 2026 సంవత్సర క్యాలెండర్, డైరీని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- తెలంగాణలో వారందరికీ బిగ్‌షాక్..
- తొలి మూడు రోజులు టోకెన్లున్న భక్తులకే వైకుంఠ దర్శనం:టి.టి.డి చైర్మన్







