ఉక్రెయిన్ క్షిపణి దాడిలో 400 మంది రష్యా సైనికుల మృతి

- January 02, 2023 , by Maagulf
ఉక్రెయిన్ క్షిపణి దాడిలో 400 మంది రష్యా సైనికుల మృతి

ఉక్రెయిన్: రష్యా సేనలను ఉక్రెయిన్ సమర్థంగా ఎదుర్కొంటోంది.దొనేత్సక్ ప్రాంతంలో ఇవాళ క్షిపణి దాడిలో 400 రష్యా సైనికులు మృతి చెందారని ఉక్రెయిన్ ప్రకటించింది.మకీవ్కాలోని ఓ భవనాన్ని క్షిపణి ధ్వంసం చేసిందని, అందులోని ఉన్న రష్యా సైనికులు మృతి చెందారని తెలుస్తోంది. అయితే, ఈ దాడిలో మొత్తం ఎంతమంది మృతి చెందారన్న విషయాన్ని ఎవరూ నిర్ధారించలేదు. పలువురు చనిపోయారని రష్యా సానుకూల అధికారులు కూడా చెప్పారు.

అయితే, ఎంతమంది మృతి చెందారన్న వివరాలు తెలపలేదు. అమెరికా అందించిన క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు చేసినట్లు పలువురు అధికారులు వివరించారు. ఉక్రెయిన్ చెబుతున్న మృతుల సంఖ్య కన్నా తక్కువ మందే మృతి చెందారని రష్యా అధికారులు అంటున్నారు.ఉక్రెయిన్ చేసిన దాడిలో చాలా మంది రష్యా అధికారులకు గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది.

ఉక్రెయిన్ క్షిపణి దాడితో ఆ భవనం మొత్తం ధ్వంసమైందని అధికారులు చెప్పారు. అలాగే, అందులోని రష్యా సైనికుల ఆయుధాలు అన్నీ ధ్వంసమయ్యాయి. ఉక్రెయిన్ పై రష్యా కొన్ని నెలలుగా దురాక్రమణ చేస్తున్నప్పటికీ ఉక్రెయిన్ ఏ మాత్రం వెనక్కు తగ్గకుండా పోరాడుతోంది. పశ్చిమ దేశాలు అందిస్తున్న ఆయుధాలు, సాంకేతిక సాయంతో ఉక్రెయిన్ పోరాడుతోంది. మరోవైపు, కీవ్ లో రష్యా చేస్తున్న దాడులు కొనసాగుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com