ఈ ఏడాది చివర్లో అల్ ముతాహిదా టవర్ ప్రారంభం
- April 28, 2016
వివా బహ్రియాలోని 'పెరల్ ఖతార్ ఐకానిక్ టవర్ అల్ ముతాహిదా' ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. యునైటెడ్ డెవలప్మెంట్ కంపెనీ (యుడిసి) మార్కెటింగ్ మరియు కమ్యూనికేషన్స్ డైరెక్టర్ హుస్సేన్ అక్బర్ అల్ బకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రముఖ ఖతార్ షేల్ హోల్డింగ్ కంపెనీ అయిన యుడిసి మరియు మాస్టర్ డెవలపర్ ఆఫ్ ది పెరల్ ఖతార్, మూడు రోజులపాటు జరిగే సిటీస్కేప్ 2016, దోహా ఎగ్జిబిషన్లో అల్ మతాహిదా సహా పలు ప్రాజెక్టులను, ప్రాపర్టీలను ప్రదర్శనకు ఉంచాయి. సిగ్నేచర్ టవర్‌లో మిగతా టవర్స్‌కి భిన్నంగా లగ్జరీ లెవల్లో ఉంటాయని అల్ బకర్ చెప్పారు. సరికొత్త పేమెంట్ ప్లాన్స్‌తో యుడిసి ఆఫర్ చేస్తోందనీ, కొనుగోలుదారులకు ఇదెంతో సులువుగా ఉంటుందని ఆయన వివరించారు. యుడిసికి చెందిన మదీనా సెంట్రాలె ప్రాజెక్ట్‌లో 95 శాతం ఇప్పటికే ఫుల్ అయిపోయాయి. ఇందులో 538 మెడిటెర్రానీన్ స్టైల్ మిడ్ రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటాయి. రిటైల్ విభాగానికి సంబంధించి 700,000 చదరపు మీటర్ల స్థలం అందుబాటులో ఉంటుంది. ఇండోర్ షాపింగ్ కాంప్లెక్స్ ఇందులో మరో ప్రధాన ఆకర్షణ. జూన్ లేదా జులైలో యుడిసి అబ్రాజ్ క్వార్టీయర్ టవర్స్‌ని ష్ట్రప్రారంభించనుంది. ఇందులో 42 స్టోరీ టవర్స్ ఉంటాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







