వివాదాస్పద వ్యాఖ్యలు: టీచర్‌కి 500,000 దిర్హామ్‌ల ఫైన్
- April 28, 2016
రిటైర్డ్ టీచర్‌కి 500,000 ఫైన్ విధించింది న్యాయస్థానం. ఆమె తన అంకుల్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యల్ని వాట్సాప్‌లో పంపారు. నిందితురాలికి మెటర్నల్ అంకుల్ బాధితుడు వేరే మతానికి చెందిన వ్యక్తి. దాంతో, మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా కూడా వాట్సాప్‌లో మెసేజ్‌లను పంపింది బాధితురాలు. నవంబర్ 2015 నుండి జనవరి 2016 వరకు ఈ మెసేజ్‌ల ప్రసహనం నడిచింది. తాను బాధ్యతగల టీచర్ ఉద్యోగంలో ఉన్నాననీ, తనకు అన్నీ తెలుసనీ, విధి నిర్వహణలో ప్రతి ఒక్కరూ తనను మెచ్చుకునేవారనీ, 29 ఏళ్ళుగా టీచర్‌గా పనిచేశానని, అయితే తనను ఆ వ్యక్తి వేధింపులకు గురిచేయడమే కాకుండా, తన వద్ద డబ్బులు తీసుకున్న ఆ వ్యక్తి తనను అవమానపర్చాడనీ, తాను క్యాన్సర్‌తో బాధపడుతున్నా తనపై వేధింపులు కొనసాగించడంతోనే తన ఆగ్రహాన్ని మెసేజ్‌లు పంపడం ద్వారా తీర్చుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ న్యాయస్థానానికి తెలిపారు. బాధిత అంకుల్, మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా తిట్టడంతోపాటు తనను అవమానించిందంటూ న్యాయస్థానానికి తెలియజేశాడు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







