‘శాకుంతలం’ వచ్చేదెప్పుడంటే.!
- January 03, 2023
స్టార్ హీరోయిన్ సమంత, ఈ మధ్య మయో సైటిస్ అనే వ్యాధి బారిన పడి చికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ‘యశోద’ టైమ్‌లోనే సమంత ఈ అరుదైన వ్యాధి బారిన పడ్డట్లు ఆ సినిమా ప్రమోషన్లలో పలువురు ప్రస్థావించారు. ఎలాగోలా ఆ సినిమా పూర్తి చేసింది సమంత.
ఆ తర్వాత కూడా సమంత చేతిలో చాలానే ప్రెస్టీజియస్ ప్రాజెక్లులున్నాయ్. అందులో కొన్ని హిందీ సినిమాలు కూడా వున్నాయ్. తెలుగు విషయాన్నికి వస్తే, ‘ఖుషీ’ ప్రెస్టీజియస్ మూవీ. ఈ మూవీ షూటింగ్‌కి సమంత అనారోగ్యం కారణంగా బ్రేక్ పడిపోయింది.త్వరలోనే షూటింగ్లో పాల్గొనబోతున్నట్లుగా సమంత మేనేజర్ ఇటీవల సందేశం అందించారు.
కాగా, సమంత నటించిన మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘శాకుంతలం’. పౌరాణిక నేపథ్యం ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో విజువల్స్‌కి అత్యంత ప్రాధాన్యత వుంది.ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్స్‌లో బిజీగా వున్న సంగతి తెలిసిందే.
తాజాగా ‘శాకుంతలం’ సినిమా రిలీజ్ డేట్ అధికారికంగా లాక్ చేస్తూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 17న సినిమా రిలీజ్ కాబోతోంది. ఆ డేట్‌కి పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాల్లేకపోవడం సమంత ‘శాకుంతలం’కి కలిసొచ్చే కాలమే అని చెప్పొచ్చు. గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ ముద్దుల తనయ అర్హ, సమంత చిన్నప్పటి పాత్రలో కనిపిస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- భారత్‌లో త్వరలో 2 కొత్త ఎయిర్‌లైన్స్..
- రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం: కేటీఆర్
- 'అటల్ స్మృతి న్యాస్ సొసైటీ' అధ్యక్షులుగా వెంకయ్యనాయుడు
- 22 సెంచరీలతో హజారే ట్రోఫీ ప్రారంభం
- 2029 ఎన్నికల ఫలితాల రిజల్ట్ ను ముందే చెప్పిన సీఎం రేవంత్
- ప్రజాస్వామ్య బలోపేతంలో మీడియా పాత్ర కీలకం: మంత్రి పార్థసారధి
- కేంద్రం పరిచయం చేస్తున్న ‘భారత్ టాక్సీ’ యాప్
- న్యూఇయర్ వేడుకలు..హద్దు మీరితే కఠిన చర్యలు
- అల్-అకిలా బీచ్ రీ డెవలప్ మెంట్ ప్రారంభం..!!
- ఖతార్‌లో స్థిరంగా టూరిజం గ్రోత్.. జీసీసీ మద్దతు..!!







