బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌లో 567 ఉద్యోగాలు..
- January 03, 2023
న్యూ ఢిల్లీ: న్యూఢిల్లీలోని బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్సులో.. 567 వెహికల్ మెకానిక్, డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్, ఆపరేటర్ కమ్యూనికేషన్ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 27 యేళ్ల మధ్య ఉండాలి.
ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్ కు ప్రకటన విడుదలైన 45 రోజుల్లోపు (జనవరి 20) పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్ధులు దరఖాస్తు రుసుముగా రూ.50 చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఖాళీల వివరాలు:
రేడియో మెకానిక్ పోస్టులు: 2
ఆపరేటర్ కమ్యూనికేషన్ పోస్టులు: 154
డ్రైవర్ మెకానికల్ ట్రాన్స్‌పోర్ట్(ఓజీ) పోస్టులు: 9
వెహికల్ మెకానిక్ పోస్టులు: 236
ఎంఎస్‌డబ్ల్యూ డ్రిల్లర్ పోస్టులు: 11
ఎంఎస్‌డబ్ల్యూ మేసన్ పోస్టులు: 149
ఎంఎస్‌డబ్ల్యూ పెయింటర్ పోస్టులు: 5
ఎంఎస్‌డబ్ల్యూ మెస్ వెయిటర్ పోస్టులు: 1అడ్రస్: Commandant BRO School & Centre, Dighi camp, Pune- 411 015.
మరిన్ని వివరాల కోసం ఈ క్రింద లింకు క్లిక్ చెయ్యండి.
తాజా వార్తలు
- 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితా సవరణ..
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత







