అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ అగ్రస్థానాన్ని సాధించడం ఖాయమని మోదీ..
- April 28, 2016
భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. నావిగేషన్ వ్యవస్థలో ఏడో ఉపగ్రహ ప్రయోగం పూర్తి కావడంతో దేశంలో సమూల మార్పులు వస్తాయన్నారు. ఈ ఉప్రగహ ప్రయోగంతో దేశానికి సొంత జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటైందన్నారు. సామాన్యుల జీవితాలు, వ్యవస్థల్లో మార్పుల కోసం అంతరిక్ష పరిజ్ఞానం దోహదపడుతోందని మోదీ అభిప్రాయపడ్డారు.ఈ ఉప్రగహ ప్రయోగం విజయవంతంతో 1500 చ.కి.మీ పరిధిలో నావిగేషన్ వ్యవస్థ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. దీని ద్వారా ఏ రైలు ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చన్నారు. సొంతంగా నావినేషన్ వ్యవస్థ కలిగిన ఐదు దేశాల్లో భారత్ ఒకటిగా నిలవడం గర్వకారణంగా ఉందని మోదీ అన్నారు. ఇస్రో సేవలు మన దేశానికే కాకుండా, సార్క్ దేశాలకు కూడా అందించాలని మోదీ సూచించారు. ఇస్రో విజయాలు ఇలాగే కొనసాగితే అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ అగ్రస్థానాన్ని సాధించడం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







