‘వారసుడు’ ముందే వస్తాడట.!
- January 05, 2023
తమిళ హీరో విజయ్‌తో తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న సినిమా ‘వారసుడు’. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా రూపొందిన ఈ సినిమా రిలీజ్ విషయంలో బోలెడంత రచ్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.
దిల్ రాజు బ్యానర్లో రూపొందిన ఈ సినిమా ధియేటర్ల విషయంలో వేడి వేడిగా చర్చల్లో నిలుస్తోంది. కాగా, జనవరి 12న రిలీజ్ కావల్సిన ‘వారసుడు’, ఒక్కరోజు ముందుకు జరిగినట్లు తెలుస్తోంది. అంటే, జనవరి 11న ‘వారసుడు’ మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఆ డేట్‌కి తమిళ వెర్షన్ కన్ఫామ్ చేశారు. కానీ, ఇంకా తెలుగు వెర్షన్ అధికారికంగా ప్రకటించలేదు.
ఇదిలా వుంటే, వెరీ లేటెస్ట్గా రిలీజైన ‘వారసుడు’ ట్రైలర్‌పై మిశ్రమ స్పందన వినిపిస్తోంది. గతంలో వచ్చిన పలు సినిమాల కాపీ కలబోతగా ఈ సినిమా రూపొందిందని మాట్లాడుకుంటున్నారు. ట్రైలర్ చూస్తుంటే, అదే అనుభూతి కలుగుతోంది అందరికీ.
ముఖ్యంగా అప్పుడెప్పుడో యంగ్ హీరో నవదీప్ నటించిన ‘గౌతమ్ ఎస్ఎస్సీ’ సినిమానే విజయ్‌తో వంశీ పైడిపల్లి మళ్లీ తీసేశాడంటూ ఎక్కువగా చర్చ నడుస్తోంది. చూడాలి మరి, ఈ మిక్స్డ్ టాక్‌తో ‘వారసుడు’ ఎలా గట్టెక్కుతాడో.!
తాజా వార్తలు
- యూఏఈ ఎమిరేట్స్ ఐడితో ఫ్రాడ్ రిస్క్..డేటా ప్రొటెక్షన్ గైడ్..!!
- ఇరాన్ దురాక్రమణ పై యూఎన్ఓలో బహ్రెయిన్ ఫైర్..!!
- ఉత్తర అల్ షర్కియాలో భారీగా పొగాకు ఉత్పత్తులు స్వాధీనం..!!
- సౌదీలో లేబర్ తనిఖీలు.. 80వేల సౌదీకరణ ఉల్లంఘనలు..!!
- కువైట్ లో నలుగురు ప్రవాసులకు, పీఏసీఐ అధికారికి జైలు శిక్ష..!!
- ఖతార్‌లో మూడవ దశలోకి హాట్ సీజన్..!!
- ఖతార్ ఎమిర్‌కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్‌లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట







