దుబాయ్ టూరిస్ట్ వీసా: ఓవర్ స్టేకి Dh300 వరకు జరిమానా
- January 06, 2023
దుబాయ్: విజిట్ వీసాతో దుబాయ్ లో అడుగుపెట్టిన వారు వీసా గడువు ముగిసిన తర్వాత ఎన్ని అదనపు రోజులుంటే ఆ కాలానికి జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. దుబాయ్ నుంచి తిరిగి వెళ్లేందుకు ల్యాండ్ సరిహద్దులు, విమానాశ్రయాలు లేదా ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో అవుట్ పాస్ లేదా లీవ్ పర్మిట్ పొందవలసి ఉంటుందని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ (GDRFA) దుబాయ్‌లోని కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ ఒకరు తెలిపారు. దేశంలో ఎక్కువ కాలం ఉంటున్న ఎవరైనా అవుట్పాస్ లేదా లీవ్ పర్మిట్ పొందాలని ఆయన ధృవీకరించారు. ఈ అనుమతిని అల్ అవీర్ ఇమ్మిగ్రేషన్ కార్యాలయంలో కూడా పొందవచ్చన్నారు. వీసా గడువు కంటే ఎక్కువ కాలం దుబాయ్ లో గడిపిన సందర్శకుడు దేశంలో వీసా గడువును పొడిగించిన రోజులకు కూడా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ట్రావెల్ పరిశ్రమ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ ప్రక్రియ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. దేశంలో ఎక్కువ కాలం గడిపిన వారు చాలామంది దుబాయ్ వీడేముందు Dh200 నుండి Dh300 వరకు జరిమానాలు చెల్లించి లీవ్ పర్మిట్ పొందారని తెలిపారు.
గలదరి ఇంటర్నేషనల్ ట్రావెల్ సర్వీసెస్‌లో MICE & హాలిడేస్ మేనేజర్ మీర్ వాసిం రాజా మాట్లాడుతూ.. వీసా గడువు ముగిసిన తర్వాత లేదా ఎమిరేట్స్ అందించే గ్రేస్ పీరియడ్ తర్వాత దేశంలో నివసించే సందర్శకులకు అవుట్పాస్ లేదా లీవ్ పర్మిట్ అవసరమన్నారు. ట్రావెల్ ఇండస్ట్రీ నిపుణుడి ప్రకారం, దుబాయ్ విజిట్ వీసా హోల్డర్లకు వీసా గడువు ముగిసిన తేదీ నుండి 10 రోజుల గ్రేస్ పీరియడ్ లభిస్తుంది.
తాజా వార్తలు
- రేపు విజయవాడలో భారీ వర్షాలు
- లాహ్ వా కలాం: ఖతార్ లో మరో ల్యాండ్ మార్క్..!!
- సౌదీ అరేబియాలో పెరిగిన చమురుయేతర ఎగుమతులు..!!
- నవంబర్ 3న జెండా ఎగురవేయాలని షేక్ మొహమ్మద్ పిలుపు..!!
- కువైట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇండోర్ రోలర్ కోస్టర్..!!
- ఒమన్ లో పర్యాటక ప్రాంతంగా సమైల్ కోట..!!
- భారత కబడ్డీ జట్టుకు సత్కారం..!!
- జస్టిస్ సూర్యకాంత్ తదుపరి సీజేఐగా జస్టిస్ గవాయ్ సిఫారసు
- అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు – హోంమంత్రి అనిత
- త్వరలో హైదరాబాద్ కు 2,000 ఎలక్ట్రిక్ బస్సులు







