‘వీరయ్య’ వెర్సస్ ‘వీరసింహం’.! తగ్గేదే లే.! ఫ్యాన్స్‌కి పూనకాలే.!

- January 06, 2023 , by Maagulf
‘వీరయ్య’ వెర్సస్ ‘వీరసింహం’.! తగ్గేదే లే.! ఫ్యాన్స్‌కి పూనకాలే.!

సంక్రాంతి రేస్‌లో బాక్సాఫీస్ వద్ద తలపడబోతున్నారు ఇద్దరు స్టార్ హీరోలు చిరంజీవి, బాలయ్య. ఈ రెండు సినిమాలనూ సేమ్ బ్యానర్‌లో రూపొందించారు.
రెండింట్లోనూ ఒకే హీరోయిన్ నటిస్తోంది. టైటిల్స్‌లోనూ ‘వీర’ లెవల్ వుంది. ఇలా చెప్పుకుంటూ పోతే, రెండింట్లోనూ పోలికలు ఎక్కువే వున్నాయ్. రెండింటి పైనా భారీ అంచనాలూ వున్నాయ్.
ఈ ఏడాదికి ఎలాగైనా రెండు సినిమాలూ హిట్ అవ్వాలని ఇరు హీరోల ప్యాన్స్ గాఢంగా కోరుకుంటున్నారు. ఆ క్రమంలోనే ప్రమోషన్లు పోటా పోటీగా పద్ధతిగా చేస్తున్నారు.
ఈ రోజు అనగా జనవరి 6 శుక్రవారం ‘వీర సింహారెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలులో ఘనంగా ఏర్పాటు చేశారు. రాత్రి 8.17 నిముషాలకు ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు.
అలాగే, ఆదివారం జనవరి 8న మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేర్ వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వైజాగ్ మహా నగరం ముస్తాబవుతోంది. అంతకన్నా ముందే అంటే, శనివారం జనవరి 7 వ తేదీన ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
సో అటు బాలయ్య, ఇటు చిరంజీవి ఇద్దరి హీరోలకూ వరుస పండగ మొదలైపోయినట్లే. పూనకాలు లోడింగ్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com