త్వరలోనే షూటింగ్‌కి హాజరు కానున్న సమంత.! ప్రూఫ్ ఇదిగో.!

- January 06, 2023 , by Maagulf

మయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ సమంత గత కొన్నాళ్లుగా మీడియా యాక్టివిటీస్‌కీ, షూటింగ్ షెడ్యూల్స్‌కీ దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. 
‘యశోద’ టైమ్‌లో ఓ ఇంటర్వ్యూతో మీడియాకి ముఖం చూపించిన సమంత, తన ఆరోగ్యం గురించీ, ఇకపై తన కెరీర్ గురించీ పలు ఆసక్తికరమైన అంశాల్ని పంచుకుంది.
‘జీవితం మునుపటిలా లేదు..’ అంటూ కొంత ఎమోషన్ అయ్యింది కూడా. ఆ తర్వాత ఒకసారి సోషల్ మీడియా చిట్ చాట్‌లో పాల్గొంది సమంత. ఇక, తాజాగా ఎయిర్ పోర్ట్‌లో సమంత కనిపించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ముంబయ్ నుంచి ల్యాండ్ అయిన సమంత, త్వరలో షూటింగ్‌కి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే త్వరలో సమంత షూటింగ్‌కి హాజరవుతుందని ఆమె మేనేజర్ స్పష్టం చేశారు. 
సో అందుకే సమంత హైద్రాబాద్‌లో ల్యాండ్ అయ్యుంటుందని అనుకుంటున్నారంతా. ‘ఖుషి’ షూటింగ్ సమంత అనారోగ్యం వల్లే బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. సో, సమంత ఈజ్ బ్యాక్ కాబట్టి, ఇక రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వబోతోందన్న మాట. అయితే, మునుపటిలా సమంతలో అంత హుషారు కనిపించడం లేదన్నది నెటజన్ల అభిప్రాయం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com