కువైట్ ఇండియన్ ఎంబసీలో జనవరి 9న ‘ప్రవాసీ దివస్’ లైవ్ స్ట్రీమింగ్
- January 06, 2023
కువైట్: కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం 2023 జనవరి 9, 10 తేదీల్లో ఎంబసీ ఆడిటోరియంలో 17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) కన్వెన్షన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. భారతీయ కువైట్ ఎంబసీలో 9వ తేదీన ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు నిర్వహించే లైవ్ స్ట్రీమింగ్‌లో చేరాలని ఎంబసీ భారతీయ పౌరులందరినీ ఆహ్వానిస్తుంది.10వ తేదీన మధ్యాహ్నం 1:00 నుండి 2:30 వరకు లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది.
17వ ప్రవాసీ భారతీయ దివస్ (PBD) కన్వెన్షన్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 08 - 10 జనవరి 2023 వరకు జరుగుతుంది. గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జనవరి 09న ప్రారంభ సెషన్లో పాల్గొని ప్రసంగిస్తారు. జనవరి 10వ తేదీన గౌరవనీయులైన రాష్ట్రపతి పాల్గొని ప్రసంగిస్తారు.
భారత ప్రభుత్వంతో ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ సంబంధాలను బలోపేతం చేయడానికి, వారి మూలాలతో తిరిగి కనెక్ట్ చేయడానికి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి ప్రవాసీ భారతీయ దివస్ ను జరుపుకుంటారు. ఇండోర్‌లో జరిగే 17వ PBD సమావేశానికి ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో NRIలు హాజరవుతారు.ఈ సారి కన్వెన్షన్ ను "డయాస్పోరా: రిలియబుల్ పార్టనర్స్ ఫర్ ఇండియా ప్రొగ్రెస్ ఇన్ అమృత్ కాల్" థీమ్ తో నిర్వహిస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్ అమీర్‌ను కలిసిన లులు గ్రూప్ చైర్మన్ ఎం.ఏ.యూసఫ్ అలీ..
- యూఏఈలో భారత రాయబార కార్యాలయం వాక్-ఇన్ విధానంలో పరిమిత కాన్సులర్ సేవలు
- UPI ద్వారా ఇండియన్స్ ఏయే దేశాల్లో చెల్లింపులు చేయొచ్చు?
- తెలంగాణ కు మూడు ఎయిర్‌పోర్టులు..
- షేక్ జాయెద్ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా ఫస్ట్ అల్ ఖైల్ స్ట్రీట్ కారిడార్..
- బిగ్ టికెట్ డ్రాలో కేరళ ప్రవాసికి 25 వేల దిర్హామ్‌ల బహుమతి
- షార్జాలో జూలై 1 నుంచి అర్ధరాత్రి వరకు పెయిడ్ పార్కింగ్..
- మెటాకు కేంద్రం షాక్..వాట్సాప్ కొత్త ఫీచర్ పై నిఘా..
- విజయ్ ప్రభుత్వం కూల్చే కుట్ర.. ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల ఆఫర్..
- సీఎం రేవంత్ తో అనలాగ్, ఎంఈఐఎల్ ప్రతినిధుల సమావేశం







