వాల్తేర్ వీరయ్య ట్రైలర్ విడుదల
- January 07, 2023
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య ట్రైలర్ వచ్చేసింది. మెగా అభిమానులు చిరంజీవిని ఎలా చూడాలనుకుంటున్నారా..సినిమా ఎలా ఉండాలనుకుంటున్నారా అదే తీరులో సినిమా ఉండబోతుందని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. మాస్ డైలాగ్స్ , దుమ్ములేపే డాన్స్ , ఈలలు వేయించే చిరు లుక్ , థియేటర్స్ దద్దరిల్లిపోయేలా దేవి శ్రీ మ్యూజిక్ ..అన్నిటికి మించి బాబీ డైరెక్షన్ ఎలా అన్ని కూడిన ఫుల్ మాస్ బిర్యానీ వాల్తేర్ వీరయ్య అందించబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.
గాడ్ ఫాదర్ తో మెగా హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం వాల్తేర్ వీరయ్య గా సంక్రాంతి సందర్బంగా జనవరి 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. బాబీ(కేఎస్ రవీంద్ర) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ లో చిరంజీవి కి జోడిగా శృతి హాసన్ నటిస్తుండగా, రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నాడు. కేథరిన్ థ్రెసా, సముద్రఖని, బాబీ సింహా, బిజు మీనన్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుగా , మైత్రి మూవీ మేకర్స్ నిర్మించారు.
ప్రస్తుతం చిత్ర మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటివరకు విడుదలైన అన్ని సాంగ్స్ ఒక్కోటి ఒక్కో రేంజ్ లో ఉండగా..అసలు సిసలైన ట్రైలర్ ను శనివారం మేకర్స్ వదిలారు. మెగా అభిమానులంతా ఎలా ఉండాలనుకుంటున్నారో అదే రేంజ్ లో ట్రైలర్ ఉంది. నీ కథలోకి నేను రాలా.. నా కథలోకే మీరందరూ వచ్చారు. మీరే నా ఎర.. నువ్వే నా సొర! , “మాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన్ను సూసే…! ఇక ట్రైలర్ చివర్లో.. రవితేజ ‘హలో మాస్టారూ.. ఫేస్ కొంచెం లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి’ అంటే.. చిరు.. ‘ ఈ సిటీకి నీలాంటి కమీషనర్లు వస్తుంటారు.. పోతుంటారు.. కానీ ఇక్కడ వీరయ్య.. లోకల్’ అంటూ ఒకరి డైలాగ్ మరొకరు చెప్పడం అదిరిపోయింది. ఓవరాల్ గా ట్రైలర్ అంత కూడా మెగా అభిమానులకు ఫుల్ మిల్స్ పెట్టె విధంగా ఉంది. ఇక థియేటర్ లో సినిమా ఏ రేంజ్ లో పూనకాలు తెప్పిస్తుందో చూడాలి.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







