చిరంజీవి చేతులు మీదగా అవార్డుని అందుకున్న అడివి శేషు..
- January 08, 2023
హైదరాబాద్: టాలీవుడ్ టాలెంటెడ్ హీరోస్‌లో అడివి శేషు ఒకడు. ఆక్టర్‌గా, రైటర్‌గా సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకున్నాడు. గూఢచారి సినిమాతో మొదలైన తన విజయ పరంపరాని ఇప్పటి వరకు కొనసాగిస్తున్నాడు. గత ఏడాదిలో ఈ హీరో ‘మేజర్’, ‘హిట్-2’ సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్టులను అందుకున్నాడు. తాజాగా అడివి శేషు తన అభిమాన హీరో చిరంజీవి చేతులు మీదగా అవార్డుని అందుకున్న విషయాన్ని తెలియజేస్తూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.
ముంబై తాజ్ హోటల్ ఉగ్రవాదులను ఎదిరించి పోరాడిన ‘మేజర్ ఉన్ని కృష్ణన్’ బయోపిక్ ని ‘మేజర్’గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం అడివి శేషు చాలా కష్టపడ్డాడు. నటుడు గానే కాదు రైటర్ గా కూడా ఈ సినిమా విజయంలో ఒక కీలకమైన పాత్ర పోషించాడు. కాగా ప్రతి ఏటా టాలీవుడ్ యాక్టర్స్ కి సంతోషం అవార్డ్స్ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది పురస్కారాల్లో అడివి శేషు మేజర్ సినిమాకు గాను అవార్డుని అందుకున్నాడు.
ఆ అవార్డుని చిరు చేతులు మీదగా అందుకున్నాడు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ట్విట్టర్ లో.. ‘చిన్నప్పుడు మీ సినిమా టికెట్‌లు కోసం కొట్టుకునే వాళ్ళం.అలాంటి మీరు ఒక హాఫ్ డే అంతా మా మేజర్ సినిమా గురించి మాట్లాడడం నాకు చాల గర్వంగా ఉంది. ఇక ఇప్పుడు మీ చేతులు మీదగా ఆ సినిమాకి అవార్డుని అందుకోవడం నాకు జీవితాంతం గుర్తుండి పోతుంది’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అవార్డుని అందుకుంటున్న ఫోటోలను కూడా షేర్ చేశాడు.
తాజా వార్తలు
- కువైట్, ఈజిప్ట్ సంబంధాలు బలోపేతం..!!
- ఐదుగురుని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- మెడికల్ అలెర్ట్: షింగిల్స్ వ్యాక్సిన్ తో స్ట్రోక్, డిమెన్షియా దూరం..!!
- 21వ ప్రాంతీయ భద్రతా సమ్మిట్ 'మనామా డైలాగ్ 2025' ప్రారంభం..!!
- సౌదీలో 60.9 మిలియన్ల పర్యాటకులు..ఖర్చు SR161 బిలియన్లు..!!
- ‘ప్రపంచ ఉత్తమ విమానయాన సంస్థగా ఖతార్ ఎయిర్వేస్..!!
- ఏపీ: తొక్కిసలాటలో 10 మందికి పైగా దుర్మరణం
- అర్థరాత్రి ఆమెజాన్ ఉద్యోగులకు లేఆఫ్ మెసేజ్ షాక్
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- మైనారిటీలకు ఉచితంగా టెట్ కోచింగ్: మంత్రి ఫరూక్







